Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన-తుర్కయంజాల్
తుర్కయంజాల్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపించాలని, చైర్పర్సన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి టీిఆర్‌ఎస్ కౌన్సిలర్‌పై నిధుల కేటాయింపుల విషయంలో వివక్ష చూపుతున్నారని బుధవారం టీఆర్ఎస్ కౌన్సిలర్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీిఆర్‌ఎస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో 9.76 కోట్లతో బడ్జెట్ టీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డుల అభివద్ధికి కేవలం 30లక్షలు మాత్రమే కేటాయించడం ఎంత వరకు సమంజసమన్నారు. 4,11వ వార్డులకు రూపాయి కూడా కేటాయించలేదన్నారు. 9.46 కోట్లతో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు కేటాయించి, టీఆర్ఎస్ కౌన్సిలర్ లపై వివక్ష చూపుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ వార్డులకు ప్రత్యేకంగా కేటాయించిన నిధులు కూడా పక్కదారి పట్టిస్తున్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు అన్నీ పాత గ్రామపంచాయతీ ముద్రణలు చేసి పర్మిషన్లతో నిర్మిస్తున్నారని, వాటిపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో టీిఆర్‌ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్యాణ్ నాయక్, కౌన్సిలర్లు సంగీత మోహన్ గుప్త, వేముల స్వాతి అమరేందర్ రెడ్డి, పుల్ల గుర్రం కీర్తన విజరు ఆనంద్ రెడ్డి, గుండ భాగ్యమ్మ ధన్ రాజ్, సిద్ధల జ్యోతి పాల్గొన్నారు.