Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమస్యల పరి ష్కారం కోసం కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్య క్షుడు జంపన ప్రతాప్ ఢిల్లీలో డిఫెన్స్ డైరెక్టర్ జనరల్‌ను కలిశారు. సమస్యలకు సంబంధించిన వినతిపత్రం అందజేసి పలు విషయాలపై చర్చిం చారు. ఈ మేరకు ఆయన బుధవారం నాడు ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఢిల్లీకి వెళ్లి అక్కడ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ కలిశారని వినతి పత్రాలు ఇచ్చారని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం కంటోన్మెంట్ ప్రాంతం త్వరలో డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ గోయల్ పర్యటించనున్నారని వివరించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ఢిల్లీ వెళ్ళి కంటోన్మెంట్ డీజీపీని కలిసి ప్రజా సమస్యలపై చర్చించిన విషయాలను వెల్లడించారు. కేంద్ర రక్షణ శాఖ పరిధిలో గల సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూభాగం 41 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నదని, కంటోన్మెంట్ భూభాగం చుట్టూ అధిక శాతం కంటోన్మెంట్లో ప్రైవేటు స్థలాలు ఉండగా, 272 కాలనీలు, 13 గ్రామాలు, 16 సివిల్ బజారులు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 2011లో జనాభా ప్రకారం 2,17,910 మంది ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని జంపన ప్రతాప్ పేర్కొ న్నారు. అయితే స్థానికులు ఇండ్లను, భవనాలను నిర్మించుకోవాలన్న ఎఫ్.ఎస్.ఐ రూల్ ప్రకారం మార్పులు, చేర్పులు జరిగాయి.
1.5 ప్రకారం భవనాలు నిర్మించు కోవాలన్న అధికారిక ప్రకటన రానున్నదని కూడా ఆయన తెలిపారు. ఆయా విషయాలపై డీజీపీ పరుచూరి గోయల్‌తో చర్చించడం జరిగిందని, ఈ కంటోన్మెంట్ బోర్డు సీఈవోగా కూడా విధులు నిర్వహించిన గోయల్ బోర్డుపై ఎంతో అవగాహన ఉందని తెలిపారు. మా విజ్ఞప్తి మేరకు డీజీపీ గోయల్ త్వరలో కంటోన్మెంట్లో పర్యటించి సమస్యల పరిష్కారం కోసం కషి చేస్తారని జంపన ప్రతాప్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తంచేశారు.