Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
మహానగరంలో ఉన్న నాలాలను యుద్ధప్రాతిపదికన ఆధునీకరించాలని బీజేపీ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎం.గౌతమ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని, జీహెచ్ ఎంసీని డిమాండ్ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక రూపొందించి ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని ధ్వజమెత్తారు. వెంటనే నాలా పూడికతీత చేసి ఆధునీకరించని పక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. బుధవారం ఆయన నల్లకుంట రత్ననగర్, ఫీవర్ ఆస్పత్రి తదితర ప్రాంతాల్లోని నాలాలను సందర్శించి, ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం.గౌతమ్ రావు మాట్లాడుతూ నాలా ఆధునీకరణ కోసం పూడిక తీసి పూడికతీత కోసం వర్షాకాలంలో నగరంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.829కోట్లు కేటాయించి చెప్తున్నప్పటికీ ఆచరణలో నిధులు కేటాయించి పూడికతీత ఆధునీకరణ చేయటంలో ఘోరంగా జీహెచ్‌ఎంసీి వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగరాన్ని సింగపూర్‌గా ఇస్తాంబుల్‌గా డల్లాస్‌గా తీర్చిదిద్దు తామని పదేపదే ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం జీహెచ్‌ఎంసీి ఆచరణలో వైఫల్యం చెందిందని విరుచుకుపడ్డారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ జీహెచ్‌ఎంసీి ప్రణాళిక రూపకల్పన చేసి పూడికతీత ఆధునీకరణ ఎందుకు చేయలేదని నిలదీశారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో వర్షాలు కురిసి, వరదల వల్ల కాలనీలో నివాస ప్రాంతాలు, బహుళ అంతస్తుల భవనాలు వరద నీటిలో మునిగిపోయినప్పటికీ ఎందుకు చర్యలు చేపట్టడం లేదని జీహెచ్ఎంసీ అధికారులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల ముందు హైదరాబాద్ నగరాన్ని అభివద్ధి చేస్తామని, అన్ని రకాల మౌలిక సదుపాయాలు నగరవాసులకు కల్పిస్తామని, పుంఖానుపుంఖాలుగా ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఆచరణలో చిత్తశుద్ధి లోపించిందని ఆయన విమర్శించారు. గత సంవత్సరం అక్టోబరులో కురిసిన వర్షాల వల్ల వరదలు సంభవించి కాలనీలు, నివాస ప్రాంతాల్లో అనేక రోజులపాటు మునిగిపోయి ప్రజలు ఇబ్బంది పడ్డారని, అదే సమస్య పునరావతం కాకుండా వెంటనే తీసివేసి, ఆధునీకరించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు.