Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
స్వచ్ఛ గ్రామ సాధనకు పాలకవర్గం ఐక్యతతో కృషిచేస్తుందని సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం కాచవాని సింగారం గ్రామ పంచాయతీ పాలకవర్గం సాధారణ సమావేశం సర్పంచ్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా అభివృద్ధి సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పల్లె ప్రగతి, హరితహారం, ఇంకుడు గుంతల నిర్మాణం గురించి సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. కరోనా బారినపడిన పంచాయతీ సిబ్బందికి పూర్తివేతనం, పారిశుధ్య సిబ్బంది వేతనాలు పెంచడానికి తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ, కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు మట్ట విష్ణుగౌడ్, రాయబండి నవీన్, పెరుమాండ్ల సుదర్శన్, బండిరాల శ్యామ్, రాజగోని మహేష్ కుమార్, అంబటి సంధ్య, నల్ల అరుణ, నల్ల రజిత, మట్ట లలిత, కో ఆప్షన్ సభ్యులు వర్కాల అంజనేయులు గౌడ్, బిల్కలెక్టర్ శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.