Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర బీజేపీ మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డి
నవతెలంగాణ-అంబర్‌పేట
వర్షపునీటి నాలా పరివాహక ప్రాంతాలు ముంపునకు గురికాకుండా వెంటనే ముందస్తు చర్యలు చేపట్టాలని నగర బీజేపీ మాజీ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి అన్నారు. బుధవారం బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని వైభవన్నగర్ కాలనీ సీజన్స్ ఆస్పత్రి లేన్‌లో ఉన్న వర్షపునీటి నాలాను బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధికార ప్రతినిధి ఎడెల్లి అజరుకుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లోని లోతట్టు ప్రాంతాలైన వైభవ్‌నగర్, బతుకమ్మకుంట, సాయిమధురానగర్, సాయి అపార్ట్మెంట్స్, మల్లిఖార్జున్‌నగర్ ప్రాంతాలు గతేడాది కురిసిన వర్షాలతో నీట మునగడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇన్ని రోజులు వర్షపునీటి సమస్యను పట్టించుకోకుండా తీరా వర్షాకాలంలో వర్షాలు మొదలైన సమయంలో సమీక్షలు నిర్వహించి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాగ్ అంబర్‌పేట డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కోడూరి సురేష్, నాయకులు శ్రీహరి, హేమంత్, జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.