Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- పలు పనుల నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ-బడంగ్‌పేట
జల్పల్లి మున్సిపాల్టీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబి తా ఇంద్రారెడ్డి అన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రయినేజీ, వరుదనీటి వ్యవస్థను మార్పు చేయటానికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. బుధవారం జల్పల్లి మున్సిపాల్టీ పరిధిలోని పలు కాలనీల్లో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాది, రిప్రజెంటెటివ్ వైస్ చైర్మన్ యూసూప్ పటేల్ లతో కలసి డ్రైనేజీ, వరుద కాల్వల నిర్మాణ పను లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో మున్సిపాల్టీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయటానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో మున్సిపాలిటీల్లో రూ.4.50తో ఇంటిగ్రెటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేయ బోతున్నట్టు తెలిపారు. జల్పల్లి పెద్ద చెరువు సుందరీ కరణ కోసం రూ.9కోట్ల నిధులు మంజూరు చేశామనీ, త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో మున్సిపాల్టీని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ డాక్టర్ జి.ప్రవీణ్ కుమార్, మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఎక్బాల్ ఖలిఫా, కో-ఆప్షన్ సభ్యులు సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్ లక్ష్మి నారాయణ, పల్లపు శంకర్, షేక్ అమిదా అప్జల్, మాజీ అర్మిమెన్ వాసుబాబు, టీఆర్ఎస్, ఎంఐఎం, తదితరులు పాల్గొన్నారు.