Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మేడ్చెల్ సర్కిల్ సీఐ ప్రవీణ ్రెడ్డి ఏర్పాటు చేసిన బ్లెడ్ డోనేషన్ కార్యక్ర మానికి రాజశే ఖర్‌రెడ్డి ముఖ్య అథితిగా హాజరై కార్యక్ర మాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రవీణ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపి వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. సీఎం కేసీఆర్ ఆదేశా లతో కరోనా సమయంలో పోలీసులు అద్భుతంగా పని చేస్తున్నారని తెలపారు. లాక్డౌన్లో ప్రజ లను కట్టడి చేస్తూనే ప్లాస్మా డోనేషన్ లాంటి కార్యక్రమాలు చేపడు తున్నారని కొనియాడారు. కరోనా నియంత్రణకు అటు డాక్టర్లు, ఆశా వర్కర్లు, పోలీసులు, మీడియా ప్రతినిధు లు నిరంతరం పని చేస్తూ ప్రజలను కాపాడటంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ నిర ంతరం శ్రమిస్తు న్నారనీ, వారి నాయకత్వంలోనే రాష్టం అన్ని రంగాల్లో ముం దుకు సాగుతోందని తెలిపారు. రక్తదాన కార్యక్రమంలో భాగ ంగా ముందుకొచ్చి నేను రక్తం ఇస్తానని రక్తదానం చేసిన రాజశేఖర్‌రెడ్డి అభిమాని సందీప్గౌడ్ను అభినందించారు. ఒక సందీప్‌నే కాదు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో ప్రజలు, యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రక్తదా నం చేసిన వారికి సర్టిఫికెట్స్ అందజేశారు.ఈ కార్యక్ర మంలో టీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామ కూర మహేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సిహ్మరెడ్డి, టీఆర్ఎస్కేవీ ప్రభాకర్, పూడూర్ సర్పంచ్ బాబు యాదవ్, మేడ్చల్ కౌన్సిలర్లు వంగ వెంకట్‌రెడ్డి, భాగ్యారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.