Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత సైన్యం అధ్యక్షుడు వేములవాడ రాజ్‌కుమార్
నవతెలంగాణ-నారాయణగూడ
రాష్ట్రంలోని భూములు, వనరులకు అమ్ముకోవడం కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించామా? అని దళిత సైన్యం (దళిత హక్కుల సమైక్య సమితి) వ్యవస్థాపక అధ్యక్షుడు వేములవాడ రాజ్‌కుమార్ ప్రశ్నించారు. బుధవారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం భూ ముల అమ్మకానికి తెరలేపి కార్పొరేట్ శక్తులకు రాష్ట్రాన్ని కట ్టబెట్టే చర్యలకు ఉపక్రమిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దేవాదాయ వక్ఫ్ భూములను ఆక్రమణ నుంచి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన సీఎం అటు వైపుగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని గుర్తు చేశారు. ప్రభుత్వ భూములను తెగనమ్ముకోవడానికి తెలంగాణ ఉద్య మం చేయలేదనీ, ఇక్కడి భూములు, వనరులను రక్షించుకో వడం కోసమే వందలాది మంది విద్యార్థి, యువజన, ఉద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారనీ, వారి సమా ధుల పేరుతో లబ్ది పొందాలనుకోవడం తెలంగాణ ద్రోహం గానే ఇక్కడి ప్రజానీకం భావిస్తున్నారన్నారు. బడాబాబులు, సీమాంధ్రుల చేతుల్లో మగ్గుతున్న వేలాది దేవాదాయ, వక్ఫ్, ట్రస్ట్ భూములను మొదటగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పక్కా ఇండ్ల నిర్మాణం, ఉపాధి రంగాల కు కేటాయించాల్సింది పోయి ఉన్న భూములను తెగనమ్మి భావి తెలంగాణ ప్రజల అవసరాలకు ప్రభుత్వాస్పత్రులు, విద్యాలయాలకు భూమి లేకుండా చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజానీకం వ్యతిరేకించాలన్నారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈ ప్రభుత్వ దోపిడీ విధానాలను ఎండగట్టి తెలంగాణ ప్రజల ముందు తమ చిత్తశుద్ధిని చాటాలని కోరారు. కబ్జాల నుంచి ముం దుగా ఆయా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవా లని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దళిత సైన్యం నేతలు బెజ్జం రాజు, నాగేశ్వర్రావు, శ్రీకాంత్ పాల్గొన్నారు.