Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
కాలనీలో మౌలిక వసతులు కల్పించేలా కృషి చేస్తున్నామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని సప్తగిరికాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యపై ఆయనతో పాటు కార్పొరేటర్ దోడ్ల వెంకటేష్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావులు పర్యటించి పరిశీలించారు. అనంతరం ఎయిర్ టెక్ మిషన్ ద్వారా డ్రైనేజీ సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్‌లో పునరావృత్తం కాకుండా ప్రతి మ్యాన్హౌల్ను కవర్ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మురుగునీటి ప్రవాహం సాఫిగా సాగేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్‌రెడ్డి, నాయకులు సైదేశ్వర్, కాశీనాథ్‌యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.