Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
ఒకప్పుడు చెరువుల అంటే మంచి నీటితో కళకళలాడుతూ పచ్చదనాన్ని పంచుతూ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేవి. వేసవికాలం వచ్చిందంటే తట్టుకోవడం కోసం చెరువులో ఈత కొట్టే వారు కానీ ఇప్పుడు పాలకులు అధికారుల ముందు చూపు లేక నగర ప్రాంతాల్లో చెరువుల కబ్జాలకు గురవుతూ కనుమరుగవుతున్నాయి. ఉన్న చెరువులు నీటితో కళకళలాడుతూ దుర్గంధం వెదజల్లుతూ దోమల ఉత్పత్తి కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న చెరువులను సుందరీకరణ పేరుతో ఎన్నో కోట్ల ఖర్చు పెట్టి నెక్లెస్ రోడ్ మాదిరి చేస్తామని చెప్పిన మాటలు నీటిమూటలుగా మిగిలాయి. అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ కౌకుర్ భరత్ నగర్ కాలనీలో మోతుకులకుంట చెరువులోకి పూర్తిగా డ్రయినేజీ అవుట్ లైట్ మురుగునీరు చెత్తా చెదారంతో నిండి పోయాయి. దీనికితోడు చికెన్ మటన్ షాప్ నుంచి వ్యర్ధాలు తీసుకొచ్చి ఈ చెరువులో పడేయడం వల్ల చుట్టుపక్కల కంపుకొడుతున్నారు. కాలనీ వాసులు దుర్వాసనతో నిరంతరం ముక్కు మూసుకునే పరిస్థితి దానికి తోడు దోమల బెడద నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని స్థానికులు పోతున్నారని బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు హరీశ్వర్ రెడ్డి మండిపడ్డారు. చెరువు గుర్రపుడెక్క తో నిండిపోవడంతో చుట్టుపక్కల వున్న ప్రజలు దోమలు స్వైరవిహారం తో పగలు రాత్రి అనే తేడా లేకుండా దోమకాటుకు లబోదిబోమంటున్నారని పేర్కొన్నారు. దీనిని అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. బీజేపీ డివిజన్ అధ్యక్షులు ప్రకాష్ చౌదరి, బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు గోపి, నాయకులు తిరుపతి రెడ్డి, అనిల్, రాజ్, నవీన్, ఆనంద్, కౌశిక్, నాగరాజు, శైలేష్, సుమంత్ పాల్గొన్నారు.