Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంచలనం రేపిన హత్యకేసు నిందితుడి అరెస్టు ఐదు గ్రాముల రింగ్‌లు,
- 60 తులాల వెండి పట్టీలు స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో సంచలనం రేపిన హత్యకేసును వెస్టుజోన్ టాస్క్ఫోర్సు పోలీసులు ఛేదించారు. నిందితుడి నుంచి ఐదు గ్రాముల బంగారు రింగ్‌లు, 60 తులాల వెండి పట్టీలు, సెల్‌ఫోన్‌తోపాటు రాడ్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నగర పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి సీపీ అంజనీకుమార్ వివరాలను వెల్లడించారు. నారాయణ్‌పేట్‌కు చెందిన గంజి వెంకటేశ్ ఉపాధికోసమని 2009లో హైదరాబాద్‌కు వచ్చాడు. అప్పటి నుంచి గోల్గొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుల్సాన్ కాలనీలో నివాసముంటూ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. మణికొండ లేబర్ అడ్డా నుంచి కూలీలను తీసుకెళ్లి నగరంలోని వివిధ ప్రాంతాల్లో భవన నిర్మాణ, ఇతర నిర్మాణ పనులను చేయిస్తుంటాడు. ఆయితే ఆశించిన తీరులో సంపాదన లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మణికొండ లేబర్ అడ్డావద్ద బి.చిన్నమ్మ అనే లేబర్‌ను గమనించాడు. ఆమెపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలపై కన్నేశాడు. వాటిని ఎలాగైనా కొట్టేయ్యాలని ఆమెతో మాటలు కలిపాడు. మాదాపూర్‌లో పనిఉందని ఈ నెల 9న తీసుకెళ్లాడు. మార్గమధ్యలో రాయదుర్గంలోని కల్లుదుకాణానికి తీసుకెళ్లి ఇద్దరు కల్లు తాగారు. అంతేకాకుండా మద్యం సేవించారు. అక్కడి నుంచి షేక్‌పేట్‌లో శ్మశానవాటిక వద్దకు వెళ్లారు. అదును చూసుకుని చిన్నమ్మ తలపై ఇనుప రాడ్‌తో బలంగా కొట్టాడు. దాంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఆమెపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. కేసునమోదు చేసుకున్న గోల్గొండ పోలీసులు అన్నికోణాలో విచారణ జరిపించారు. తప్పించుకుని తిరుగుతున్న నిందితుడి సమాచారం సేకరించిన గోల్గొండ పోలీసులు, టాస్క్ఫోర్సు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. సంచలన రేపిన కేసును ఛేదించడంతో పోలీసులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.