Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి చామకూర మల్లారెడ్డి
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని 5, 12, 15, 17వ వార్డుల్లో మున్సిపల్ చైర్మెన్ బోయపల్లి కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవితో కలిసి దాదాపు రూ. 1.87 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవర్గాలు ఐక్యతతో అన్ని మున్సిపాలిటీ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మెన్ నానావత్ రెడ్యా నాయక్, కమిషనర్ సురేష్, కౌన్సిలర్లు బెజ్జంకి హరిప్రసాద్ రావు, అబ్బవతి సరిత స్వామి, సుర్వి సుధాలక్ష్మీ శ్రీనివాస్ గౌడ్, సుర్వి రవిందర్ గౌడ్, మెట్టు బాల్రెడ్డి, సింగిరెడ్డి సాయిరెడ్డి, బాలగోని వెంకటేష్ గౌడ్, ఆకిటి శైలజ, గొంగళ్ళ మహేష్, మోటుపల్లి పోచమ్మ, భైర హిమ, కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ అక్రమ్ ఆలీ, దాసరి శంకర్, టీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గొంగళ్ల బాలేష్, ప్రధాన కార్యదర్శులు నల్లవెల్లి శేఖర్, కొమ్ముల ప్రశాంత్, నాయకులు మెట్టు కొండల్ రెడ్డి, బద్దం జగన్ మోహన్ రెడ్డి, బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి, నర్రి కాశయ్య, ఆకిటి బాల్రెడ్డి, అబ్బవతి నర్సింహ్మ పాల్గొన్నారు.