Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీనగర్
దేశ వ్యాప్తంగా కేంద్ర సర్కారు ప్రవేశ పెట్టిన ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని పొదుపు మహిళా సంఘాలకు వ్యాక్సిన్ వేయనున్నారు. గాంధీనగర్ డివిజన్, దోమల గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ హైస్కూల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గాంధీ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఏ పావని వినరు కుమార్ ఈ కార్యక్రమాన్ని పర్య వేక్షించారు. వారు మాట్లాడుతూ.. ప్రతిక్షణం పేదల అభ్యున్నతికోసం ప్రధాని నరేంద్రమోడీ పాటుపడుతున్నారని చెప్పారు. అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడంపట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చితే మన దేశంలో కొవిడ్ కేసులు తక్కువగా నమోద య్యాయన్నారు. కవాడిగూడ, గాంధీనగర్, దోమలగూడ ప్రాంతాల మహిళా సంఘాల సభ్యులకు, స్థానిక మహిళలకు ఇక్కడ వ్యాక్సిన్ అందించనున్నట్టు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నగర సీనియర్ నాయకులు ఎ. వినరు కుమార్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ రత్న రాణి, ఏఎంసీ మురళి, డీసీ మధు పాల్గొన్నారు. పాల్గొన్నారు