Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు కిషన్‌రావు
నవతెలంగాణ-కల్చరల్
దేశంలోని ఇతర రాష్ట్రాలలో తెలుగు భాష, సంస్కతి పరిరక్షణకు తెలుగు విశ్వవిద్యాలయం సహకరిస్తుందని విశ్వవిద్యాలయ నూతన ఉపాధ్యక్షులు ఆచార్య టీ. కిషన్‌రావు అన్నారు. విశ్వవిద్యాలయంలో బుధవారం మండలి వెంకట కష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం నిర్వహణలో అంతర్జాల వేదికగా దేశంలోని వివిధ రాష్ట్రాలలోని తెలుగు సంఘం ప్రతినిధులతో మాట్లాడారు. ఆయా ప్రాంతాలలోని తెలుగు ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తామన్నారు. తెలుగు పండుగల సందర్భంలో ఆయా ప్రాంతాలకు మరుగున పడిపోతున్న కళా ప్రక్రియల కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చెన్నై తెలుగు సంఘం సి.ఎం.కె.రెడ్డి, తిరువనంతపురం తెలుగు సాంస్కతిక సంఘం యజ్ఞరాయణ, కొల్‌కత ఆంధ్ర సంఘం కూచిమంచి మోహన్, బొంబాయి ఆంధ్ర మహాసభ (జింఖాన) రాజారామ్, పూణే ఆంధ్ర అసోసియేషన్ రవీనా చవాన్లతో పాటు రాజస్థాన్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోని తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు