Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిలీ పత్రాలతో ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లు
- నిందితుడి అరెస్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
తప్పుడు పత్రాలతో ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లను సృష్టించి అమ్మాయిని వేధింపులకు గురిచేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం రాచకొండ సీపీ మహేష్‌భగవత్ తెలిపిన వివరాల మేరకు సైదాబాద్‌కు చెందిన చిన్నా వెంకన్న రాజశేఖర్ రెడ్డి జులాయిగా తిరుగుతున్నాడు. అమ్మాయిలకు గాలం వేయడం, వారిని బెదిరించి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈ క్రమంలో నకిలీ పత్రాలతో ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లను తెరిచాడు. ముందుగా ఫ్రెండ్ రెక్వెస్ట్ పంపించి, స్పందిచిన వారితో స్నేహం చేస్తాడు. ఆ తర్వాత వారి ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకుపాల్పడ్తాడు. తాను చెప్పినట్టు వినాలంటూ వేధింపులకు గురిచేస్తాడు. ఇదే తరహాలో ఓ అమ్మాయికి ఫ్రెండ్ రెక్వెస్ట్ పంపించి పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్ల పాటు స్నేహంగా వున్న నిందితుడు ఆ తర్వాత వక్రబుద్ధిని బయటపెట్టాడు. దాంతో యువతి నిందితుడిని దూరం పెట్టడంతో కక్ష పెంచుకున్నాడు. క్లోజ్గావున్న సమయంలో తీసుకున్న ఫోటోలను మార్ఫింగ్ చేశాడు. తాను చెప్పినట్టు వినాలంటూ బెదిరించడం ప్రారం భించాడు. అంతటితో ఆగకుండా మార్ఫింగ్ చేసిన పోటోలను అమ్మాయి కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపించడంతోపాటు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ వేధించడం ప్రారంభించాడు. యువతి పట్టించు కోకపోవడంతో వాటిని స్నేహితులకు, బంధువులకు, యువతి కుటుంబసభ్యులకు పంపించాడు. అయితే నిందితుడి వేధింపులు రోజురోజుకు అధికం కావడంతో బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏసీపీ హరినాత్ ఆదేశాలతో విచారణ చేపట్టిన ఇన్స్పెక్టర్ ఎన్.రాము నిందితుడిని సాక్ష్యాధారాలతో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.