Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-డీఐఈవోకు ఎస్ఎఫ్ఐ వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న, ఎన్వోసీలేని ప్రయివేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈమేరకు బుధవారం జిల్లా ఇంటర్మీడియట్ అధికారికి ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.అశోక్ రెడ్డి, ఎండీ జావిద్ మాట్లాడుతూ.. ఎన్వోసీ రెన్యూవల్ చేసుకోకుండానే అడ్మిషన్లు నిర్వహిస్తున్న జూనియర్ కాలేజీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగేలా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. జిల్లాలో అత్యధికంగా ప్రయివేటు, కార్పొరేట్ విద్య సంస్థల్లో పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువు తున్నారని, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఫీజుల వసూలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. గతేడాది కరోనా సందర్భంగా ప్రభుత్వం ఫీజు పెంపు లేకుండా ఇచ్చిన జీవోను వెంటనే అమలు చేయాలని కోరారు. ఆన్లైన్ క్లాసుల ఫీజు ప్రణాళికను విడుదల చేయాలని, గుర్తింపు లేకుండా అడ్మిషన్లు చేస్తున్న కాలేజీలను మూసివేయాలని వారు డిమాండ్ చేశారు.