Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసలే పేద, మధ్య తరగతి బతుకులు, వివిధ కంపెనీల్లో, సంస్థల్లో ప్రయివేటు ఉద్యోగాలు చేసుకునేవారు కొందరు. కూలీనాలి చేసు కునేవారు ఇంకొందరు. ఉన్న ఊరిలో ఉపాధిలేక బతుకు దెరువుకోసం హైదరాబాద్వచ్చి అద్దె ఇండ్లల్లో ఉంటూ తమ తమ పనులు చేసు కుంటున్నవారు ఎంతోమంది. వీరంతా ఇప్పుడు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. కరోనా కష్టాలు తమ బతుకులను ఇప్పటికే అతలాకుతలం చేస్తే, రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, కూర గాయల ధరలు, ఇంటి కిరాయిలు తమ బతుకులు మరింత ఆగం చేస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆపద సమయంలో ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం కనికరం, మానవత్వం లేకుండా ధరలు పెంచు తున్నాయని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఇట్లయితే తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలను ప్రభుత్వం నియంత్రించాలని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, ఉద్యోగులు కోరుతున్నారు.
- కరోనా కష్టాలు తీరకముందే ధరల పెరుగుదలతో మరిన్ని ఇబ్బందులు
- చాలీ చాలని జీతాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో మధ్య తరగతి ఉద్యోగుల అవస్థలు
- లీటర్ పెట్రోల్ ధర వందపైనే, కిలో బెండకాయ రూ. 40. ఇట్లయితే ఎలా బతకాలంటున్న జనం
- ధరలు తగ్గించాలని సర్కారుకు వేడుకోలు
నవతెలంగాణ-సిటీడెస్క్
పెట్రోల్ ధరల పెరుగుదలతో చాలామంది మధ్య తరగతి ఉద్యోగస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. టూ వీలర్ నేడు కామన్‌మెన్ అవసరంగా మారింది. ఉద్యోగానికి వెళ్లాలన్నా, ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలన్నా ప్రతి ఇంటిలో నేడు టూ వీలర్ అనేది అవసరంగా మారింది. కానీ ప్రస్తుతం దానిని ఉపయోగించుకోలేని దుర్భర పరిస్థితులు దాపురించాయని బేగం పేటకు చెందిన విశాల్, తార్నాకకు చెందిన రెహమాన్, నారాయణ గూడకు చెందిన వెంకటేశ్ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ''అసలే పదీ పన్నెండువేల జీతం. లీటర్ పెట్రోల్ ధర వంద దాటితే డ్యూటీలకు ఏం పోతం, ఇల్లెట్ల గడుస్తుంది? కరోనా ప్రభావంతో ఒక పక్క అసలు పనుల్లేక, పైసల్లేక అవస్థలు పడుతుంటే గీ రేట్లు పెంచడమేంది?'' అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు మరీ అన్యాయం అయిపోయిందని, ధరలను ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
''మా ఇంటాయన వాచ్మెన్. నెలకు 12 వేల జీతం, నెల నెలకు ఇంటికిరాయి, పొట్టకు తిన్నేకినే వచ్చే పైసలు సరిపోవు, ఇక కిలో టమాట 20 రూపాయలు, బెండకాయ 40 రూపాయలు ఉంటే ఏం కొంటం, ఏం తింటం? ఒకపక్క కరోనా చంపేస్తే, మరో పక్క పైసల్లేక పస్తులుండి సచ్చే రోజులొస్తున్నరు. ఈ ధరలు పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలె. లేకుంటే మా లాంటోల్ల బతుకులు ఆగమైతరు'' '' అంటోంది అడ్డగుట్టకు చెందిన చంద్రకళ. ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని ఆమె కోరుతోంది. ఇలా ఏ ఒక్కరో, ఇద్దరో కాదు, అనేకమంది పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. కరోనా కాలంలో ఉపాధి కోల్పోవడం, జీతాలు తగ్గడం, ఉన్న ఉద్యోగాలకు కూడా నెల నెలా టైమ్‌కు జీతం రాకపోవడం, చేతిలో పైసల్లేక ఇంటి అద్దెలు కట్టలేకపోవడం, ఇదే క్రమంలో ధరలు పెరుగుతూ ఉండటం చాలామందిని మానసికంగా కృంగదీస్తోంది. చివరకు తమ బతుకులు