Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ గ్రామపంచాయతీ హయాం నుండి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా లక్షల్లో నిధులు వెచ్చించి ఖర్చు చేయగా కార్పొరేషన్ అనంతరం కోటి 20 లక్షలు రెడ్డి అవెన్యూ ఖర్చు చేయడం జరిగిందని, ప్రజలందరికీ ఉపయోగ పడే రహదారిని ఆంక్షలు పెడుతూ మిగతా బస్తీలకు వెళ్లే ప్రజలను అడ్డుకునే విధంగా గేట్లు పెట్టి అడ్డుకోవడం రెడ్డి అవెన్యూ అసోసియేషన్ మానుకోవాలని దీనిపై అధికారులు చర్యలు చేపట్టా లని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు ఆకుల సతీష్ తెలిపారు. ఈ మేరకు గురువారం శ్రీనివాస్ నగర్ కాలనీ నుంచి రెడ్డి అవెన్యూలో కి వెళ్లే రహదారిని అదేవిధంగా, నిర్మాణం చేపట్టే ఆర్చ్ గేటు బీజేపీ నాయకులు ప్రజలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత గ్రామపంచాయతీ, కాలం నుండి ఇ ఈ రహదారి శ్రీనివాస్ నగర్ కాలనీ పాపయ్య కుంటకు తక్కువ దూరంతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటూ వస్తుందని, అలాంటి రహదారినీ, కేవలం రెడ్డి అవెన్యూ మాత్రమే పేటెంట్ హక్కులు కలిగి ఉన్నట్లు ఆంక్షలు పెట్టి రాత్రి సమయాల్లో రోడ్డు బంద్ చేయడం ఎంత మాత్రం తగదని, అలాగే సర్వేనెంబర్ 115,118 భూమి కబ్జాలో వెళ్లిపోయిందని గ్రేటెడ్ కమ్యూనిటీ లేకున్నప్పటికీ గ్రేటెడ్ పేరు సష్టించుకొని, వెంచర్ చేసినవారు అధికార పార్టీకి చెందిన వారని వారి అండదండలతో ప్రజలకు దారి లేకుండా ఇబ్బం దులకు గురి చేయవద్దని, అనుమతులు లేని నిర్మాణాలు ఓవైపు చేపడుతూ రహదారి ప్రజలకు అసౌకర్యం కల్పిస్తే అధికారులు చోద్యం చూస్తూ ఉండటం సరికాదని ఇప్పటికైనా ప్రభుత్వ స్థలం ఎక్కడ మాయ మైంది, పూర్తి సర్వే చేసి సి రెడ్డి ఎవెన్యూ అసోసియేషన్ ఆంక్షలను కట్టడి చేయాలని ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలపడంతో స్పం దించిన అధికారులు సర్వే చేపట్టి ప్రభుత్వ స్థలాన్ని పర్యవేక్షిస్తామని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని బిజెపి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఉపాధ్యక్షులు శివ కోటేశ్వరావు చౌదరి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మదన్ గౌడ్, బీజేవైఎం అధ్యక్షులు రవీంద్ర, ప్రధాన కార్యదర్శి రామ్, సీనియర్ నాయకులు జిల్లా బీజేవైఎం కాలేజీ కన్వీనర్ బిక్షపతి యాదవ్, ఓబీసీ మోర్చా నాయకులు ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.