Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి 'రాజకీయ శిక్షణా తరగతుల' మొదటి రోజు సెషన్ ప్రారంభ సమావేశాలు ఆన్‌లైన్‌్ జూమ్ యాప్ ద్వారా జరగగా, అఖిల భారత యువజన సమాఖ్య మేడ్చల్ జిల్లా సమితి పక్షాన 10 మంది యువజన క్రియాశీల ప్రతినిధి బందం హాజరయ్యారు. ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సత్య ప్రసాద్, సహాయ కార్యదర్శి ధర్మేంద్ర తెలిపారు. ఈ సమావేశానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు వల్లి ఉల్లాV్‌ా ఖాద్రీ పాల్గొన్నారు. ఈ శిక్షణా తరగతులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిóగా, ప్రారంభ ఉపన్యాసకులుగా పాల్గొని 'ప్రస్తుత రాజకీయ పరిస్థితులు - యువజన కర్తవ్యం' అనే అంశంపై బోధించడం జరిగింది. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ వ్యవస్థను యువత సుదీర్ఘంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల సాధనకు మిలిటెంట్ పోరాటాలను నిర్మితం చేసుకోవాలని, తద్వారా పాలకులను ప్రశ్నించి సమస్యలను పరిష్కరిం చేందుకు అవకాశం ఉంటుందని వారు తెలిపారు. ఈ తరగతులకు ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి బందం జిల్లా ఉపాధ్యక్షుడు సల్మాన్, రవి కుమార్, నరేష్,సబితా, అర్చనా, సతీష్, మహేష్, కిరణ్, శ్రీవాణి పాల్గొన్నారు.