Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ, సరిహద్దుల్లో జీహెచ్‌ఎంసీి చెత్త దుర్వాసన సమస్యతో ఇబ్బందులు
- హెచ్చరించినా తీరు మారని పారిశుద్ధ్య కార్మికులు
- నియంత్రణ చర్యలు ఎక్కడ ?
నవతెలంగాణ-ఓయూ
పరిశోధనలకు, ఉన్నత విద్య, ఉపాది,ó ఉద్యోగ కల్పనకు మారుపేరు అయిన ఉస్మానియా విశ్వ విద్యాలయం నేడు ఓయూ అధికారుల అలసత్వంతో ''జీహెచ్‌ఎంసీి'' పారిశుధ్య కార్మికుల పని భారం తగ్గించుకునేందుకు ఓయూను ఓయూ ప్రహరీ గోడ (సరిహద్దు) వెంట చెత్త పోయడం గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా మారింది.
చెత్త కుప్పలతో దుర్వాసన సమస్య
ఇక ఇలా చెత్త కార్మికులు దూరంగా చెత్తను తీసుకు వెళ్లాల్సి ఉన్నా ఎందుకులే శ్రమ అంటూ సమీపంలో ఉన్న ఓయూ ప్రహరీ గోడల మీదుగా ఇక్కడ చెత్తను పోయడం, కొంత రంధ్రాలు లేక గోడను పగుల కొట్టడం, ఇంకా గోడ వెంట ఎత్తులు పెట్టుకొని మరి ఇక్కడ చెత్తను ఈ పరిసరాల్లో పోస్తున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో ఫుట్ పాత్ల ఎత్తు పెంచడం ఓయూ ప్రహరీ ఎత్తు తగ్గిపోవడంతో వారి పని సులభతరంగా మారింది. దీనితో అక్కడ దుర్వాసన, పరిసరాల్లో తీవ్రమైన కంపు కొట్టడం లాంటి సమస్య లతో అటు విద్యార్థులు, ఉద్యోగులు బాధపడుతు న్నారు. ఇంకో వైపు భవిష్యత్‌లో సమీపంలో ఇక్కడ ఏదైనా నిర్మాణాలు నిర్మిస్తే భూగర్భజలాలు సహితం కలుషితమవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రవేట్ వ్యక్తుల వ్యర్ధాలు
ఇక సమీపంలోని ఆస్పత్రులు, టీ స్టాల్స్, చికెన్ మటన్ షాప్స్ వారు కూడా వారికి సంబంధించిన వివిధ రకాల వ్యర్ధాలను ఇక్కడే తెల్లవారుజామున లేక రాత్రిపూట పొద్దుపోయాక టూ విలర్స్ లేక కార్లలో వారి వారి వ్యర్ధాలను తీసుకువచ్చి ఇక్కడ సరిహద్దు ప్రాంతాల్లో పోసి చేతులు దులుపు కుంటున్నారు. వీరే కాకుండా ఓయూ పరిసరాల్లో ఉన్న వ్యక్తులు ఇళ్ల నిర్మాణం, మరమ్మతులు చేప్పట్టిన వేళా వారికి సంబంధించిన వ్యర్ధాలు కూడా ట్రాక్టర్స్పై రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడే డంపింగ్ చేస్తున్నారు. గతంలో సీఎస్ఓ అంజయ్య పలు ట్రాక్టర్స్ సీజ్ చేసినా వారి తీరు మారలేదు.
ఫైన్ వేసినా తీరుమారని పారిశుధ్య కార్మికులు
ఇలా ఓయూలో చెత్తను పోస్తున్న విషయంలో ఓయూ నాటి అధికారులు కార్మికులు తీరుపై వారిపై అధికారుల దష్టికి తీసుకెళ్లిడం జీహెచ్ఎంసీ అధికారులు పారిశుధ్య కార్మికులకు ఫైన్ విధించారు. దానితో కొన్ని రోజులు కార్మికులు చెత్తపోయడం ఆపేసినా కార్మికులు మళ్ళీ కొన్నాళ్ళ తరువాత యధారాజ తథాప్రజ అన్నట్టుగా మళ్ళీ చెత్త పోస్తున్నారు. ఇక ప్రయివేట్ వ్యక్తులు, సంస్థలు, హాస్పిటల్స్‌కు, చికేన్, మటన్ షాప్స్ తీరుమారక పోవడం గమనార్హం.
చెత్తను తగుల బెడుతున్న ఓయూ పారిశుధ్య కార్మికులు
ఇక ఓయూలో హెల్త్ సెంటర్ కింద పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బంది కూడా చెత్తను ఎత్తియడంలో కొన్నిసార్లు జన సంచారంలేని ప్రాంతాల్లో చెత్తకు నిప్పు పెట్టుతున్నారు. ఇలా చెత్తుకు నిప్పు పెట్టటంపై ఓయూ నాటి రిజిస్ట్రార్‌కు నోటీసులు కూడా వచ్చాయి. అయినా కొన్నిసార్లు ఇలా చెత్తను ఎత్తివేయకుండా కాల్చివేస్తున్నారు.
చెత్త పోస్తున్న ప్రాంతాలు ఇవే
హబ్సిగూడలోని సీసీఎంబీ, ఐఐసిటి ఎదుట, పిఅండ్‌టి కాలనీ వద్ద, తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి ఎదుట, తార్నాక చౌరస్తా చిన్న పెట్రోల్ బంక్ పక్కన, అక్కడే ప్రొఫెసర్స్ క్వార్టర్స్‌లో, విద్యుత్ సబ్‌స్టేషన్ పక్కన, మానికేశ్వరినగర్ వద్ద, మేకస్టర్ ఆడిటోరియం ఎదుట, మసీదు ఎదుట, అర్బన్ సెంటర్ ఎదుట, అక్కడే బస్టాండ్, ఆర్ట్స్ కళాశాల రైల్వే స్టేషన్‌కు వెళ్లే రహదారి వెంట, బీఈడీ కళాశాలకు రెండు వైపుల ఉన్న ప్రహరీల వెంట, డిడి కాలనీ ప్రహరీలు వెంట, హబ్సిగూడ కాకతీయ నగర్ వైపు ఈ ప్రాంతాల్లో మొత్తం చెత్త భరితంగా మారాయి.