Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు బీసీ సంఘాల విజ్ఞప్తి
నవతెలంగాణ-అడిక్మెట్
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టేందుకు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో గురువారం ఆరాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలోని 56 శాతం జనాభా ఉన్న బీసీలకు 74 ఏండ్ల తర్వాత కూడా ప్రజాస్వామ్యవాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని, ఇప్పటికైనా అన్ని రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని కోరారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, సి.రాజేందర్, గుజ్జ సత్యం, జిల్లపల్లి అంజి, వేముల రామకృష్ణ, చంటి ముదిరాజ్, సుచిత్ కుమార్, రవీందర్, ఉదరు తదితరులు పాల్గొన్నారు.