Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని చెరుకుపల్లికాలనీ, మధుసూధన్రెడ్డినగర్, వెంకటేశ్వరనగర్లలో రూ.94.80 లక్షలతో నూతనంగా చేపట్టనున్న భూగర్భ డ్రయినేజీ, సీసీ రోడ్డు, ఆర్సీసీ పైపులైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నిధులకు కొరత లేకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి వహిస్తూ కాలనీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వరద నీటితో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఈఈ కృష్ణ చైతన్య, డీఈ పాపమ్మ, ఏఈ మల్లారెడ్డి, మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, నాయకులు సోమేష్‌యాదవ్, కిషోర్‌చారి, సత్తిరెడ్డి, సురేందర్‌రెడ్డి, రామ్‌చందర్, అరుణ, మల్లేష్, కుమారస్వామి, పుల్లారావు, వెంకటయ్య, కృష్ణరెడ్డి, మల్లేష్, ఆంజనేయులు, జ్యోతి పాల్గొన్నారు.