Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
ఓ కేసులో మధ్యవర్తిగా వెళ్లిన తనపై అక్రమ కేసులు బనాయించి మానసికంగా వేధిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు మట్టా జయంతిగౌడ్ డిమాండ్ చేశారు. గురువారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి గచ్చిబౌళి కాజాగుడాకు చెందిన సింధూరరెడ్డి విషయంలో జరిగిన వివాదంలో సంఘసేవకురాలిగా రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నర్సింహారెడ్డి పక్షాన మాట్లాడటంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మధ్యవర్తిగా వెళ్లిన తనపైనే అక్రమ కేసులు పెట్టి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచి పరుష పదజాలంతో దూషించడమే కాకుండా మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల వేధింపులతో తాను బాత్రూంకు వెళ్ళి ఆత్మహత్యాప్రయత్నం చేయడంతో తడబడిన పోలీసులు పొద్దునే జైలుకు తరలించారని వెల్లడించారు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం మధ్యవర్తిగా నర్సింహారెడ్డికి మద్దతుగా మాట్లాడినందుకే పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టి తన ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ సంఘటనపై న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర మానవహక్కుల సంఘం, జాతీయ బీసీ కమిషన్‌ను ఆశ్రయించనున్నట్లు తెలిపారు. సమస్యను సెటిల్మెంట్ చేసుకోనివ్వకుండా తాము కేసు పెట్టేందుకు ప్రయత్నించడం వల్లే పోలీసులు దుర్మార్గంగా వ్యవహించారని తెలిపారు. వేధింపులకు గురి చేసి ఆత్మహత్య యత్నానికి ప్రేరేపించిన రాయదుర్గం సీఐ రాజగోపాల్‌రెడ్డి, ఎస్ఐ సైదులు, మాళీ సీఐ రవీందర్, ఎటీ సుధీర్కుమార్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ నేతలు బద్దరం మురహరి, సందీప్ యాదవ్, ఎం.గోపాల్‌గౌడ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.