Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని కాలనీల్లో వెంటనే వరదముంపు నివారణ చర్యలు తీసుకోవాలని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగా రెడ్డి అన్నారు. ఈమేరకు గురువారం ఎల్బీనగర్లో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి కార్పొరేటర్లతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గతేడాది వరదలు వచ్చి అనేక కాలనీలు ముంపునకు గురికావడంతో ప్రజలు చాలా ఇబ్బందులుపడ్డారని తెలిపారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డ్రయినేజీ, ట్రంక్ లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు కొప్పుల నర్సింహా రెడ్డి, వంగా మధుసూదన్ రెడ్డి, బీజేపీ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, విజయభాస్కర్, శ్రీనివాస్, మహిళా నాయకులు కృష్ణ వేణి పాల్గొన్నారు.