Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
సనత్‌నగర్ నియోజకవర్గం రాంగోపాల్‌పేట డివిజన్ అంబేద్కర్‌నగర్‌లో రూ. 28 కోట్ల వ్యయంతో నిర్మించిన 330 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ఈనెల 26న ప్రారంభించి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పేర్కొన్నారు. గురువారం నెక్లెస్ రోడ్ (పీవీమార్గ్)లోని అంబేద్కర్‌నగర్‌లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తున్నారని, ఇది ఆయనకు పేద ప్రజలపై ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. 26వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, అత్తిలి మల్లికార్జున గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుంద రెడ్డి, ఆర్డీఓ వసంత కుమారి, ఎమ్మార్వో జుబేదా, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, హౌసింగ్ ఈఈ వెంకటదాసు రెడ్డి, ఎలక్ట్రికల్, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.