Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్పేట
లోప్రెషర్, కలుషిత నీటి సమస్య శాశ్వత నివారణకు నూతన పైపులైన్ నిర్మాణం చేపడుతున్నామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. గురువారం కాచిగూడ డివిజన్ కుత్బిగూడలో రూ.13 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న నూతన తాగునీటి పైప్లైన్ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ కన్నె ఉమారమేష్యాదవ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం డివిజన్లోని కుత్బిగూడ, చప్పల్ బజార్, దశరథ్గల్లి ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలుషిత తాగునీటి సమస్య, డ్రయినేజీ సమస్య తీవ్రంగా ఉందని, కొన్ని చోట్ల వీధి దీపాలను ఏర్పాటు చేయాలని, కొత్త సీసీ రోడ్లు వేయాలని స్ధానికులు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రోడ్లపై చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ బద్దుల శిరీష ఓంప్రకాష్ యాదవ్, ఓం ప్రకాష్యాదవ్, రవీందర్ యాదవ్, దిండి రాంబాబు, బండ సూరి, సాయిబాబా, బాబ్జీ, భీష్మ, మన్నే శ్రీనివాస్ యాదవ్, పెంటం రమేష్, కష్ణగౌడ్, నాగరాజ్గౌడ్, రాజేష్, బాబు, కన్నె రమేష్, సంతోష్, రవి యాదవ్, రమాదేవి పాల్గొన్నారు.