Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నాయకుల డిమాండ్
- మల్లారెడ్డిగార్డెన్ ఎదుట రామకృష్ణ, నాగేష్ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-కంటోన్మెంట్
భూకబ్జాల విషయంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి చామకూర మల్లారెడ్డి తాజాగా పేకాట రాయుళ్లను ప్రోత్సహించి ఏకంగాతన ఫంక్షన్ హాల్‌ను పేకాట శిబిరంగా మార్చారని, ఆయనను తక్షణమే పదవీ నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు జె.రామకృష్ణ, ఆకుల నాగేశ్ డిమాండ్ చేశారు. బుధవారం మంత్రి సోదరుడు చామకూర నర్సింహారెడ్డి పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడి, బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం మంత్రికి సంబంధించిన మల్లారెడ్డి గార్డెన్స్ ఎదురుగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి కబ్జాలు చేయడమేగాక పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో ఈ విషయం సంచలనం రేకెత్తించిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె. రామకృష్ణ, కంటోన్మెంట్ బీజేపీ ఫౌండర్ ఆకుల నాగేశ్ అన్నారు. మల్లారెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్‌ను సీజ్ చేయాలని రక్షణ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా స్పందించాలని, మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.