Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలోనే మొదటి ఎక్మోట్రీట్మెంట్
- అరుదైన ఘనత సాధించిన కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశంలో కరోనా వైరస్ సెకండ్‌వేవ్ వ్యాప్తితో ఊహించని ప్రాణ నష్టంతోపాటు ఎంతో మంది ఇతర అనారోగ్య సమస్య లకు గురవుతున్నారు. మొదటివేవ్‌కు భిన్నంగా యువకులు, చిన్న పిల్లలకు సోకుతూ సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపు తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా సోకి తీవ్ర ఇబ్బందులు పడుతున్న 9 నెలల శిశువుకు కిమ్స్ ఆస్పత్రుల వైద్యుల బృందం 'ఎక్మో' (ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్) చికిత్స అందించి ప్రాణాలు కాపాడింది. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి సీనియర్ పీడియాట్రిషన్ డాక్టర్ వి.నందకిశోర్ నేతృత్వంలోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్‌కేర్ ( పీఐసీయూ) బందం, కొండాపూర్‌లోని కిమ్స్ కడిల్స్ పీడియాట్రిషన్ డాక్టర్ డి.పరాగ్ శంకర్రావు డెకాటే నేతృత్వంలోని పీఐసీయూ బృందాలు సంక్లిష్టమైన ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశాయి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీయాష్ (9నెలలు) జ్వరం, దగ్గుతో శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే నెల రోజుల క్రితం బాలుడి తల్లిదండ్రులు కొండాపూర్‌లోని కిమ్స్ కడిల్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శిశువును పరీక్షించిన డాక్టర్ల బృందం ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉండటంతో వెంటనే ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స ప్రారంభించారు. అయినప్పటికీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాకపోవడంతో హై ప్రీక్వెన్సీ వెంటిలేటర్ (హెచ్ఎ ఫ్వోవీ) పైకి మార్చి చికిత్సను కొనసాగించారు. మెడికేషన్‌లో భాగంగా నైట్రిక్ ఆక్సైడ్ చేర్చి బాలుడి చికిత్స కొనసాగిం చారు. అయినా ఊపిరితిత్తుల (న్యుమోథొరాక్స్) నుంచి గాలి లీక్ అవుతూ కొత్త సమస్య ఉత్పన్నమవడంతోపాటు హైఫ్రీీక్వెన్సీ వెంటిలేటర్ చికిత్సను కూడా కష్టతరం చేసింది. పరిస్థితి సంక్లిష్టంగా మారుతున్న సమయంలో డాక్టర్ల బృందం ఎక్మో సపోర్ట్‌తో చికిత్స ప్రారంభించింది. మరింత మెరుగైన చికిత్స కోసం బాలుడిని సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి మార్చారు. ఇలా 12 రోజుల పాటు ఎక్మో సపోర్టు తో చికిత్స అందించిన తర్వాత బాలుడు క్రమంగా కోలుకుం టుండడంతో ఎక్మోను తొలగించి మరో 3 రోజులు వెంటిలేటర్ చికిత్సను అందించారు. అనంతరం పిల్లవాడు ఆరోగ్యంగా తయారు కావడంతోపాటు తల్లి ఫీడింగ్ ద్వారా హుషారుగా ఉండటంతో ఒక నెల రోజులు ఆస్పత్రిలోనే చికిత్స పొందిన బాలుడిని డిశ్చార్జి చేసి ఇంటికి పంపిం చారు. కిమ్స్ ఆసుపత్రికి చెందిన కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ హెడ్ డాక్టర్ వి.నందకిషోర్ ఇందుకు సంబం ధించిన వివరాలను వెల్లడించారు. 'కొవిడ్ బారిన పడిన పిల్లల చికిత్సలో ఎక్మో వాడటం దేశంలోనే ఇది మొదటి సారి. సెకండ్‌వేవ్‌లో చాలా మంది పిల్లలు కొవిడ్ బారిన పడుతున్నప్పటికీ చాలా మంది పిల్లలు ఆస్పత్రి చికిత్స అవసరం లేకుండానే కోలుకుంటున్నారు. కొంత మంది పిల్లలకు మాత్రమే ఆస్పత్రి మరియు ఐసీయూ చికిత్స అవసరం పడుతుంది' అని పేర్కొన్నారు.