Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మలక్పేట్
బంగారానికి హాల్ మార్క్ తప్పనిసరిగా ఉండాలి అనే నిబంధన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు ఎంతో ఉపయోగం అని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మెన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ బంగారు, బంగారు ఆభరణాలను హాల్ మార్క్ చేయాలి అన్న తప్పనిసరి నిబంధనతో, తక్కువ ధరల పేరుతో అమ్మకందారులు నాణ్యత లేని ఉత్పత్తులను కొనుగోలుదారులకు అంటగట్టి మోసం చేసే పద్ధతిని అంతం చేయొచ్చు అన్నారు. జూన్ 16 నుండి కేంద్ర ప్రభుత్వం హాల్ మార్క్ తప్పనిసరి అని తీసుకువచ్చిన చట్టం వినియోగదారులకు బలమైన సాధనంగా చెప్పొచ్చు అన్నారు. ఈ చట్టంతో అమ్మకందారులచే మోసపోకుండా భరోసా ఉంటుంది అన్నారు. హాల్ మార్క్ తప్పనిసరి చేయడం ద్వారా వినియోగదారులు మూడు స్థాయిలో ప్రయోజనం పొందుతారు అన్నారు. వినియోగదారులు తాము కొనుగోలు చేసే బంగారం యొక్క స్వచ్ఛత, బంగారు ఆభరణాలకు అధిక మార్పిడి విలువ, తక్కువ నాణ్యత సాకుగా చూపించి హాల్ మార్క్ చేసిన బంగారం ధరలను ఎవరు తగ్గించలేరు అని అన్నారు. బంగారు, బంగారు ఆభరణాల కి వినియోగదారులకు చట్ట పరమైన రక్షణ లభిస్తుంది అన్నారు.