Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి జంటసర్కిళ్ల పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులు చివరి దశకు చేరుకోవడంతో గురువారం బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి, ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్‌గౌడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవం కష్ణారావు నేతత్వంలో రూ.387 కోట్లతో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులు పూర్తిస్థాయికి చేరుకున్నాయని, ఈ నెల ఆఖరు, లేదా జులై మొదటి వారంలో ప్రారంభోత్సవానికి సిద్ధం కానుందని, దీంతో బాలానగర్ ప్రజల కలసాకారం కాబోతుందని ట్రాఫిక్ సమస్యలు తొలిగి పోనున్నాయని వారు అన్నారు. మందడి సుధాకర్‌రెడ్డి, ఎలిజాల యాదగిరి, దేవేందర్ రెడ్డి, కష్ణమూర్తి, శేఖర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.