Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.3.5 లక్షలు దండుకున్న సైబర్ నేరస్థులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సైబర్ నేరగాళ్ల చేతిలో మరో బాధితురాలు మోసపోయింది. తాజాగా హైదరాబాద్‌లో టీసీఎస్ ఉద్యోగినిని సైబర్ మోసగాళ్లు ట్రాప్ చేశారు. మూడున్నర లక్షలను దండుకున్నారు. ముషీరాబాద్‌కు చెందిన టీసీఎస్ ఉద్యోగిని హరిణికి మొబైల్‌కి సైబర్ కేటుగాళ్లు ఒక లింక్ పంపించారు. ఆ లింక్‌ను క్లిక్ చేయగానే సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్‌లో విప్రో ఇండిస్టీస్ పేజీ ఓపెన్ అయ్యింది. ఇంతలో హరిణికి కేటుగాళ్లు కాల్ చేశారు. అందులో పెట్టుబడి పెడితే షేర్ మార్కెట్ ట్రెండింగ్‌లో వారం రోజుల్లో నాలుగు రెట్లు పెరుగుతుందని నమ్మించారు. నిజమని నమ్మిన బాధితురాలు వారు చెప్పిన విధంగా నాలుగు లక్షలను బాధితురాలు ట్రాన్స్ఫర్ చేశారు. అందులో నుంచి మొత్తం మూడున్నర లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు హరిణి సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.