Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్లో సుందరయ్యవిజ్ఞాన కేంద్రం సహకారంతో పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొవిడ్ ఐసోలేషన్ సెంటర్ను గురువారం సీపీఐ(ఎం) నాయకులు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కే. కష్ణనాయక్, కేవీపీఎస్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు బాలపీర్లు సందర్శించారు. కరోనా రోగులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో అన్ని సౌకర్యాలతో కరోనా బాధితులకు సేవలు అందించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఐసోలేషన్ కేంద్రం నిర్వాహకులను, చికిత్స అందిస్తున్న డాక్టర్లను అభినందించారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు.