Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
రాష్ట్రంలో అనేక కార్పొరేట్ కళాశాలలు ఫీజులు ఇష్టానుసారంగా వేసి విద్యార్థుల కుటుంబాలను దోపిడి చేస్తున్నాయని, వాటిని నియంత్రించే ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భవాని, పడాల శంకర్ అన్నారు. అనుమతులు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగరలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కండ్లకునల్ల బ్యాడ్జీల కట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాల ఫీజులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న వైఖరి తీరుపై మేడ్చల్ జిల్లాలో ఇటీవలే హైకోరు,్ట సుప్రీంకోర్టు ఫీజులపై అనుమతి లేని విద్యా సంస్థల పై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు.. ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వర్షం కురిసినట్లు కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజుల దోపిడీ యథేచ్ఛగా చేస్తుంటే చిన్న చర్య కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. ఒక్క మేడ్చల్ జిల్లాలోనే 15 కాలేజీలు ఎన్ ఓ సీ లేకుండా అక్రమంగా నడుస్తుంటే చర్యలు తీసుకోవడం లేదని, అందులో అత్యధికంగా చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయని, విద్యాసంస్థల్లో మూడువేలకు పైగా విద్యార్థులు ఉన్నటువంటి వారి భవిష్యత్తు ప్రమాదంలో ఉందని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి ఇకనైనా విద్యార్థులు భవిష్యత్తును ఆలోచించాలని, కేజీ టు పీజీ ఉచిత విద్య హామీలు గాలికొదిలేశారని, రాజకీయ స్వలాభం కోసమే విద్యార్థులను యువతను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పక్షాన, ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా కలిసొచ్చే తల్లిదండ్రులను కలుపుకొని ఉద్యమించడానికి భారత విద్యార్థి ఫెడరేషన్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ముందుంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బ్యాగరి వెంకటేష్, సాయి కిరణ్ జిల్లా కమిటీ సభ్యులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.