Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావు నగర్
రాష్ట్ర విద్యా రంగం పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనీ, విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పడాల శంకర్ రాష్ట్ర గవర్నర్‌కి ఈ మెయిల్ ద్వారా లేక పంపారు. రాష్ట్రం ఏర్పడి నుంచి ఇప్పటి వరకు విద్యారంగంపై సవతి ప్రేమ చూపిస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలకు మద్దతుగా బినామీలుగా రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు కేజీ టూ పీజీ ఉచిత విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు. ఏడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా వ్యవహరిస్తుందనీ, రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధిని మీరు గమనించి విద్యారంగంపై శ్రద్ధ పెట్టేలా చేయాలని తెలియజేశారు. మిశ్రితమైన విద్యావిధానం కావాలనీ, అందరికీ విద్య అందే విధంగా చూడాలనీ, అందరికీ వ్యాక్సినేషన్ తొందరగా వేయాలనీ, విద్యార్థులకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ వేసి విద్యకు దూరం కాకుండా చూడాలనీ, తరగతి గదులు ఆఫ్‌లైన్‌లో విద్యాసంస్థలు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలనీ, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న రీసెర్చ్ స్కాలర్లకు ఫెలోషిప్ పొడిగించి పెండింగ్‌లో ఉన్న ఫెలోషిప్ రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్‌లను విడుదల చేయాలనీ, పరీక్షల పేరుతో డిస్క్రిమినేషన్ చూపింపి ఫీజు కట్ట లేని వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించి లేకపోతున్నారనీ, అర్హులైన విద్యార్థులకు ఉన్నత విద్య దొరికే విధంగా పరీక్షలు నిర్వహించాలనీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించిన టాస్క్ ఫోర్స్ కమిటీని వెంటనే వేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలనీ, పేద, దిగువ, మధ్య తరగతి విద్యార్థులు కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలనీ, కరోణ నేపథ్యంలో లాక్డౌన్ మూలంతో విద్యార్థుల తల్లిదండ్రుల కుటుంబాలు హస్తగతం అయ్యాయనీ, ప్రభుత్వం పేద వాళ్లకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని కోరారు.