Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష్యం లక్ష.. పూర్తయినవి 79,582 డబుల్ బెడ్రూం ఇండ్లే లబ్దిదారులకు అందజేసేందుకు
రంగం సిద్దం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్లో ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదా రులకు దక్కనున్నాయి. ఇప్పటికే 12 ప్రాంతా ల్లోని ఇండ్లను అందజేసిన జీహెచ్ఎంసీ మరో 754 ఇండ్లను పేదలకు అందజేయనుంది. గ్రేట ర్ హైదరాబాద్‌లో రూ.9,714 కోట్ల వ్యయంతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 79, 582 ఇండ్లు పూర్తయినట్టు జీహెచ్ఎంసీ అధికా రులు చెబుతున్నారు. మొదటి దశలో ఇన్సిటూ (పాత ఇండ్ల స్థానంలో కొత్తగా నిర్మించినవి) ఇండ్లను లబ్ధిదారులకు అందజేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. తర్వాతనే ఖాళీ స్థలాల్లో నిర్మించిన ఇండ్లను పంపిణీ చేయాలని, అందు కోసం లబ్ధిదారులను ఎంపిక చేయాలని జీహెచ్ ఎంసీ, రెవెన్యూ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇంతవరకు లబ్ధిదారుల ఎం పిక ప్రక్రియ ప్రారంభమేకాకపోవడం విశేషం.
లక్ష ఇండ్ల నేపథ్యం..
గ్రేటర్ హైదరాబాద్‌లో రూ.9,714.59 కోట్లతో లక్ష ఇండ్లు నిర్మించాలని సర్కార్ నిర్ణయి ంచింది. 40 ప్రాంతాల్లో ఇన్సిటూ(పాత ఇండ్ల ను కూల్చేసి కొత్తవి నిర్మించడం)లో భాగంగా 8,898 ఇండ్లను 71ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో 91,102 ఇండ్లను నిర్మించాలని నిర్ణయించారు. వీటిలో హైదరాబాద్ జిల్లాలో 9,453, రంగా రెడ్డి జిల్లాలో 23,908, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 38,419, సంగారెడ్డి జిల్లాలో 28,220 ఇండ్లు ఉన్నాయి. లక్ష ఇండ్లల్లో ఇప్పటి వరకు 2,068 ఇండ్లను మాత్రమే లబ్ధిదారులకు అందజేశారు.
754 ఇండ్లు రెడీ
గ్రేటర్లో మరో 754 ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. సుమారు రూ.58.50 కోట్ల వ్యయంతో నాలుగు ప్రాంతాల్లో నిర్మించారు. రాంగోపాల్‌పేట్‌లోని అంబేద్కర్ నగర్లో రూ.28.05 కోట్ల వ్యయంతో నిర్మించిన 400 డబుల్ బెడ్ రూం ఇండ్లను ఈ నెల 26వ తేదీన లబ్దిదారులకు అందజేయనున్నారు. పొట్టి శ్రీరాములునగర్లో రూ.14.01కోట్ల వ్యయంతో నిర్మించిన 162 డబుల్ బెడ్ రూం ఇండ్లను ఈ నెల 28వ తేదీన లబ్దిదారులకు అందజేయను న్నారు. జీవైరెడ్డినగర్లో రూ.15.57 కోట్ల వ్యయంతో నిర్మించిన 180 డబుల్ బెడ్ రూం ఇండ్లను జులై 1వ తేదీన లబ్దిదారులకు అందజేయనున్నారు. గొల్లకొమరయ్య కాలనీలో రూ.85 లక్షల వ్యయంతో నిర్మించిన 12 డబుల్ బెడ్ రూం ఇండ్లను జులై 5వ తేదీన లబ్దిదారులకు అందజేయనున్నారు ఈ ఇండ్లను ఈ నెల 26వ తేదీ నుంచి లబ్దిదారులకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు అందించనున్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీ, ప్రశాంత్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటి మేయర్ మోతే శ్రీలతా శోభన్‌రెడ్డి తదితరుల సమక్షంలో ఈ డబుల్ బెడ్ రూంలను అందజేయనున్నట్టు జీహెచ్ఎంసీ తెలిపింది.