Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారదర్శకంగా అర్హులకు రేషన్ కార్డులు అందేలా చర్యలు
- జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతామహంతి
- మంత్రి గంగుల కమలాకర్‌తో వీడియో కాన్ఫరెన్స్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నూతన రేషన్ కార్డుల జారీ, ధాన్యం సేకరణ అం శాలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలా కర్ కరీంనగర్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఎంలు, డీఎస్వోలతో వీడియో కాన్ప రెన్స్ నిర్వహించారు. పౌరసరఫరాల కార్యాలయం నుంచి కమిషనర్ అనిల్‌కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లా డుతూ రేషన్ కార్డుల జారీపై కాబినెట్ సబ్ కమిటీ సూచిం చిన విధంగా పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లను త్వరితగతిన వెరిఫికేషన్ చేసి స్పష్టమైన నివేదికను వారం రోజుల్లో తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రం లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే సీఎం కేసీఆర్ సంకల్పాన్ని అధికారులకు వివరించారు గంగుల. ఇప్పటికే ఎన్ఐసీ, ఐటీ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్‌లో మిగిలిన 4,15,901 కార్డులకు సంబందించి 11,67,827 మంది లబ్దీదారుల వివరాలను గ్రౌండ్ లెవల్ తనిఖీలు నిర్వహిం చాల్సిందిగా ఆదేశించారు. అత్యధికంగా దరఖాస్తులు ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుని ప్రత్యేక శ్రద్ద తీసుకుని ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల అవసరమైనన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం సూచించిన మేరకు నూతనంగా రేషన్ కార్డులకు సంబం ధించిన ప్రక్రియను ప్రారంభించామనీ, ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా జరిగేలా వెరిఫికేషన్ నిర్వహించడంతో పాటు అర్హులైన వారికే రేషన్ కార్డులు అందేలా చూస్తున్నామని వివరించారు. ఈ మేర కు జిల్లాకు కొత్తగా ఎన్ని రేషన్ కార్డులు అవసరమవు తాయనే వివరాలతోపాటు రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు కూడా చేసే ప్రక్రియను తమ సిబ్బంది, అధికా రులు ఇప్పటికే ప్రారంభించారనీ, ఆయా చోట్ల నుంచి వచ్చిన అప్లికేషన్లును స్వీకరించి కొత్తగా పేర్లు జత చేయ డంతోపాటు ఎవరైనా మృతి చెందితే వారి పేర్లను రేషన్ కార్డుల్లో నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సూచనల మేరకు వివిధ స్థాయిలో పెండింగులో ఉన్న దరఖాస్తులను మరోమారు పరిశీలించి మంజూరు చేస్తా మని చెప్పారు. ఈ వీసీలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సిం హారెడ్డి, డీఎస్ఓ పద్మ, డీఎంఐఆర్ రాజేందర్, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తపాలాశాఖ మైక్రో ఏటీఎం ద్వారా రైతుబంధు డబ్బులు పొందే సౌకర్యం
రాష్ట్ర ప్రభుత్వం రైతుల పెట్టుబడి కోసం అందజే స్తున్న రైతుబంధు డబ్బులను మేడ్చల్-మల్కాజిగిరి జిలా ్లలోని ఆయా తపాలా శాఖ మైక్రో ఏటీఎం కార్డుల ద్వారా రైతులకు అందుబాటులో ఉన్న పోస్టాఫీసుల్లో తీసుకోవచ్చ ని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో బ్యాంకులు, ఏటీ ఎం కేంద్రాలకు వెళ్ళి డబ్బులు తీసుకోవడానికి ఇబ్బందికర ంగా ఉంటుందనీ, దీన్ని దృష్టిలో ఉంచుకుని తపాలాశాఖ ద్వారా రైతులు డబ్బులు తీసుకునేనేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. తపాలాశాఖ ద్వారా రైతుబంధు డ బ్బులను తీసుకోవడం వల్ల బ్యాంకుల్లో రైతులు గుమిగూడ కుండా ఉండటంతో పాటు రైతులకు సైతం ఎలాంటి ఇబ్బ ందులు ఉండవని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పోస్టాఫీస్‌ల నుంచి ఖరీఫ్ సీజన్లో రైతులకు డబ్బు లు విత్‌డ్రా చేసి అందచేసేందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా 5,794 పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎం సేవలను ప్రారంభి ంచినట్టు తెలిపారు. జిల్లాలోని రైతులకు ఏ బ్యాంకులో ఖాతాలున్నా వారి ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్లతో సమీ పంలోని పోస్టాఫీసులో సంప్రదించి రైతుబంధు డబ్బులను తీసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతా అనుసంధానం ఉన్న వారికే ఈ వెసులుబాటు ఉంటుందనీ, రోజుకు రూ.10 వేలకు మించకుండా పోస్టాఫీసుల్లో డబ్బులు డ్రా చేసుకోవడానికి అవకాశముందనీ, రైతులు తమ సమీపంలోని పోస్టా ఫీసుకు వెళ్లి ఫింగర్ ప్రింట్ ద్వారా తమ మొబైల్‌కు వచ్చే ఓటీపీ నెంబర్ చెప్పి డబ్బులు డ్రా చేసుకోవచ్చని వివరిం చారు. రైతులకు ఈ సేవలన్నీ ఉచితంగా అందుతాయనీ, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.