Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజలకు అవసరమయ్యే మౌళిక వసతులు కల్పించేం దుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం నాగారం మున్సిపాల్టీలో సూమారు రూ.2.20 కోట్ల నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు, ప్రహరీగోడ, శ్మశానవాటిక, పార్కు అభివృద్ధి పనులను నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డితో కలిసి మంత్రి శుక్రవారం ప్రారంబి óంచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సి పాల్టీల్లో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ది పనులు చేపట్టా మన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేయాలనే సంకల్పంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంద న్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సి పల్ కమిషనర్ వాణిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ బి.మల్లేష్ యాదవ్, కౌన్సిలర్లు చింతల సరిత, ఎలిజాల నాగేష్‌గౌడ్, గోక కళావతి యాదగిరి, అన్నంరాజు లావణ్య శ్రీనివాస్, కౌకుంట్ల అనంత్‌రెడ్డి, గూడురు సబితా ఆంజనేయులు గౌడ్, కౌకుంట్ల మమతా కృష్ణారెడ్డి, కొమురవెళ్లి అనితా సూధాకర్‌రెడ్డి, దివ్యాదయాకర్, మోకు రేణు జగన్మోమణ ్రెడ్డి, వెంకట్‌రెడ్డి, బిజ్జ శ్రీనివాస్‌గౌడ్, అన్నంరాజు, సుమిత్ర సురేష్, కో-అప్షన్ సభ్యుడు అదామ్ షపీక్, నాగారం మున్సిపాల్టీ టీఆర్ఎస్ అధ్యక్షులు తేళ్ల శ్రీధర్, టీఆర్ఎస్ నాయకులు గండి అంజయ్యగౌడ్, వరకాల పెంటయ్య గౌడ్, టీఆర్ఎస్ యువ నాయకులు కౌకుంట్ల రాహుల్‌రెడ్డి, వామన్, తదితరులు పాల్గొన్నారు.