Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఆనంతవేణి నగర్ కాలనీలో శుక్రవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. ఎమ్మెల్యే ఆయా కాలనీల్లో ఉన్న మూడు ఓపెన్ పార్కు స్థలాల అభివృద్ధి కోసం రూ.57 లక్షలు మంజూరు చేశారు. ఈ పార్కు స్థల ంలో చుట్టు ముట్టు కాంపౌండ్ వాల్ కట్టించాలనే ఆలోచ నతో ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రెండు, మూడు రోజుల్లో పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. సాగర్ కాంప్లెక్స్ ఫేస్-1 నందు కూడా దాదాపు రూ.80 లక్షల వ్యయంతో జిం1 కమ్యూనిటీ హాల్ కూడా మంజూరైనట్టు తెలిపారు. ఆ పనులను కూడా వెంటనే ప్రారంభించి త్వరగతిన పూర్తి చేసి కాలనీల ప్రజలకు అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కమ్యూనిటీ హాల్, పార్కులకు సంబంధించిన నిర్మాణ పను ల్లో నాణ్యమైన మెటీరియల్ వాడి పారదర్శకంగా పనులను నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, అనంతవేణి కాలనీ అధ్యక్షులు తిరుమలేష్, సెక్రెటరీ నర్సింహా, సాగర్ కాంప్లెక్స్ ఫేస్-1 అధ్యక్షులు కృష్ణా రెడ్డి, సెక్రెటరీ శ్రీనివాస్, రాఘవేందర్‌రెడ్డి, శేఖర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.