Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు అభివృద్ధి పనులు ప్రారంభం
నవతెలంగాణ-బేగంపేట్
అభివృద్ధికి ఆదర్శంగా సనత్‌నగర్ నియోజకవ ర్గాన్ని తీర్చిదిద్దడం కోసం ఎంతో కృషి చేస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సిని మాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్‌పేట డివిజన్లో సుమారు రూ. కోటీ 50 లక్షల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రార ంభించారు. బన్సీలాల్‌పేట కమాన్ నుంచి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ వరకు రూ.22.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఫుట్ పాత్, టేబుల్ డ్రైన్ నిర్మాణ పనులు, జయప్రకాష్‌నగర్‌లో రూ.8 లక్షలతో చేపట్టనున్న సీవరేజ్ పైప్ లైన్ పనులు, సీసీ నగర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల బ్యాక్ సైడ్ రూ.6.50 లక్షలతో సీవరేజ్ లైన్ రీ మోడలింగ్ పనులు, మేకల మండి ఎంట్రెన్స్ నుంచి గొల్ల కొమరయ్య కమ్యూనిటీ హాల్ వరకు రూ.26.50 లక్షలతో చేపట్టనున్న సివరేజ్ లైన్ రీ మోడలింగ్ పను లు, గాంధీనగర్, మేకల మండి ప్రాంతాల్లో రూ.24 లక్ష లతో ఏర్పాటు చేయనున్న మంచినీటి పైప్ లైన్ పనులు, మేకలమండి నుంచి కవాడిగూడ మెయిన్ రోడ్ వరకు రూ.27.50 లక్షలతో చేపట్టనున్న సీవరేజ్ లైన్ పనులు, జయనగర్‌లో రూ.40 లక్షలతో నిర్మించనున్న కమ్యూని టీ హాల్ పనులను మంత్రి ప్రారంభించారు. బన్సీలాల ్పేట కమాన్ వద్ద హై మాస్ట్ లైట్ ఏర్పాటు చేయాలనీ, నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు వెంట ఎల్ఈడీ లైట్ల ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను మం త్రి ఆదేశించారు. తాము తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని జయ ప్రకాష్‌నగర్ వాసులు మంత్రి కి విన్నవించగా, నూతన పైప్‌లైన్ ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి అందజేయాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. కమ్యూనిటీ హాల్‌కు గతంలోనే స్థలం కేటాయించారనీ, భవన నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. గొల్ల కొమరయ్య కాలనీలో డ్రెయినేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారు లను ఆదేశించారు. పిలోమినా చర్చి నుంచి మేకల మండి వరకు వీడీసీసీ రోడ్డు మంజూరైందనీ, గండెమ్మ బస్తీతోపాటు ఇతర ఇంటర్నల్ డ్రయినేజీ, వాటర్ పైప ్లైన్ పనులను రోడ్డు నిర్మాణానికి ముందే చేపట్టాలని సూచించారు. జీహెచ్ఎంసీ, వాటర్‌వర్క్స్ అధికారులు సమన్వయంతో ప్రతిపాదనలు రూపొందించి అందజే యాలని ఆదేశించారు. జయనగర్‌లో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ ఆవరణలోనే వాలీబాల్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. ఐడీహెచ్ కాలనీ అమ్మవారి కమాన్ నుంచి గొల్ల కొమరయ్య కాలనీ సీసీ రోడ్డు నిర్మా ణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటరాజును మంత్రి పరామర్శి ంచి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. జూలై 1వ తేదీన ప్రారంభించనున్న డీవైఆర్ కాంపౌండ్‌లో నిర్మిం చిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్దిదారులు మంత్రిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, పద్మారావు నగర్ టీఆర్ఎస్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్‌గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ముకుందరెడ్డి, ఆంజ నేయులు, రాజశేఖర్, రమణారెడ్డి, వెంకట్రావ్, వెంకట దాసు రెడ్డి, కృష్ణ మోహన్, మహేందర్, రవీందర్, నాయకులు ఏసూరి మహేష్, ప్రేమ్, దేశపాక శ్రీను, అబ్బాస్, కమల్ కుమార్, నాగలక్ష్మి పాల్గొన్నారు.