Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
రాష్ట్రంలో అర్హులైన పేద ప్రజలందరికీ వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న బాలాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్య క్షులు గుర్రం మల్లారెడ్డి, అధికార ప్రతినిధి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గడిచిన ఏడేండ్లుగా పేద ప్రజలకు ఒక్క రేషన్ కార్డ్ కూడా ఇవ్వలేదనీ, కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పించి వారికి కూడా ఇవ్వాలనీ, అన్లైన్లో దరఖాస్తు చేసుకోవ డానికి అవకాశం కల్పించాలని కోరారు. ఎన్నికల సమయ ంలో టీఆర్ఎస్ నాయకులు మాయ మాటలు చెప్పి అధికార ంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చ కుండా కాలయాపన చేస్తున్నారని మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ మోర్చ ప్రధాన కార్యదర్శి మోతీలాల్ నాయక్, బీజేపీ ఫ్లోర్ లీడర్ తోట శ్రీధర్‌రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దడిగే శంకర్, కార్పొరేటర్లు నిమ్మల సునిత శ్రీకాంత్‌గౌడ్, గౌర రమాదేవి శ్రీనివాస్, ఇంద్రసేన, జనిగే పద్మ ఐలయ్య యాదవ్, రామిడి మాధురి వీరకర్ణా రెడ్డి, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి దొడ్డి మల్లికార్జున్, నాయ కులు లక్ష్మారెడ్డి, సంపత్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, నగేష్, దొడ్డి శ్రీశై లం, శ్రీనివాస్ నాయక్, మంగపతి నాయక్, యువ మోర్చ ప్రధాన కార్యదర్శి అనిల్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.