Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన-తుర్కయంజాల్
కలెక్టర్ మొట్టికాయలు వేసినా తీరు మార్చుకోకుండా ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ, మున్సిపల్ అభివృద్ధికి సహక రించకుండా నియంతలా వ్యవహరిస్తున్న కమిషనర్‌ను వెంటనే బదిలీ చేయాలని మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రాంరెడ్డి అన్నారు. శుక్రవారం రాగన్నగూడ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లా డుతూ పాలకమండలి సమావేశం ముగిశాక 53 రోజుల పాటు ఒక్కమాట మాట్లాడని టీఆర్ఎస్ కౌన్సిలర్లు కమిషన ర్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టిన వెంటనే నిధుల కేటాయింపులో వివక్ష చూపారని అనడం ఎంత వరకు సమంజసమన్నారు. కమిషనర్ తీరుపై జిల్లా కలెక్టర్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా ఆయన తీరులో మార్పు రావడం లేదన్నారు. టీఆర్ఎస్ కౌన్సిలర్లు నిధుల కేటా యింపు విషయంలో వివక్ష చూపుతున్నారని అనడం అవాస్త వమన్నారు. కమిషనర్ షఫీ ఉల్లా టీఆర్ఎస్ కౌన్సిలర్లకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారి పాత్ర పోషించేది పోయి ప్రతిపక్ష పాత్ర పోషించడం సరికాదన్నారు. టీఆర్ఎస్ కౌన్సిలర్లు తమపై బురద జల్లే ప్రయత్నం మానుకుని ప్రజల సమస్యలు తీర్చి, అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్‌గౌడ్, జిల్లా కౌన్సిలర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కొషికే ఐలయ్య, కౌన్సిలర్లు మర్రి మాధవి మహేందర్‌రెడ్డి, నారని కవిత శేఖర్‌గౌడ్, కుంట ఉదయశ్రీ గోపాల్‌రెడ్డి, బొక్క రవీందర్‌రెడ్డి, కాకుమాను సునీల్, కంబాలపల్లి ధనరాజ్, నక్క శివలింగంగౌడ్, బాలరాజ్, తదితరులు పాల్గొన్నారు.