Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన వివిధ ప్రాంతాల నుంచి కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, నాయకులు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి సమస్యలను వివరించారు. దీంతో స్పందించిన ఆయన వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.