Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
మొయిన్ చెరువు నుంచి వచ్చే నాలా వెడల్పు తక్కువగా ఉండటంతో భారీ వర్షాలు వచ్చినపుడు నాలాకు ఇరువైపులా నివాసం ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌడ్ అన్నారు. శుక్రవారం మొయిన్చెరువు నాలాపై సీపీఎల్ అధికారులు, ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ మురళీధరన్, ఏసీపీ త్రిలోక్‌నాథ్‌రెడ్డి, సీఐ బిట్టు మోహన్, సీపీఎల్ ఎస్టేట్ ఇన్స్పెక్టర్ వీరు, సీఐ కె.ఎల్.నాయుడు, అడ్మిన్ ఇన్స్పెక్టర్ నాగరాజుగౌడ్, ఎస్ఐ సురేష్, డాక్టర్ సత్యనారాయణరెడ్డితో పాటు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి నాలా పరివాహక ప్రాంతం, నాలా ప్రహరీని పరిశీలించారు. ఈ సందర్భంగా విజరుకుమార్గౌడ్ మాట్లాడుతూ సీపీఎల్ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో నాలాను పరిశీలించి వరదలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పరిశీలించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఈఈ శంకర్, డీఈ సంతోష్, ఏఈలు సుధాకర్, శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు జాకీబాబు, మహేష్ ముదిరాజ్, నాగరాజు, రంగు ఉదరుగౌడ్, సంతోష్‌చారి, దినేష్ పాల్గొన్నారు.