Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
పార్కుల సుందరీకరణకు కషి చేస్తానని కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం హిమాయత్ నగర్ డివిజన్ పరిధిలోని విట్టల్వడిలో మెల్కోటే పార్కును ఏఎంహెచ్ఓ డాక్టర్ హేమలత, పార్క్ మేనేజర్ లక్ష్మణ్ సింగ్, హుడా అధికారి శివ కుమార్ రెడ్డితో కలిసి సందర్శించి అక్కడి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జీ రామన్ గౌడ, డివిజన్ అధ్యక్షుడు కె నర్సింగ్ ముదిరాజ్, నర్సింగ్ గౌడ్, రామస్వామి,జైస్వాల్, జాకి, బిందియా, శార, సందీప్, ప్రవీణ్, రంజిత్, అనిల్, వేణు గోపాల్ యాదవ్, జగదీష్ పాల్గొన్నారు.