Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం అని పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈదమ్మల బలరాం అన్నారు. శుక్రవారం పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ కుంట్లూరు 19 వ వార్డు కు చెందిన గజ్జల కిషన్ కు సీఎం ఆర్ ఎఫ్ ఫండ్ కింద రూ. 56 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గజ్జెల కిషన్ ఆరోగ్య విషయం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి దష్టికి తీసుకెళ్లామన్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గజ్జల కిషన్ వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం చేసేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.56 వేల చెక్కులను అందజేశామన్నారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ హరిశంకర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేష్, పెద్దింటి శ్రీనివాస్ రెడ్డి, జోర్క రామ్, తోటి జంగయ్య, బంగారు శశి కుమార్, నక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు.