Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
పార్కులను అభివృద్ధిపరిచి సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. శుక్రవారం కాచిగూడ డివిజన్లోని కృష్ణానగర్, బసంతకాలనీ పార్క్‌లను వివిధ శాఖల అధికారులతో కలిసి సందర్శించారు. పార్క్‌ల్లో చేపట్టాల్సిన అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పార్క్‌ల్లో వివిధ రకాలైన పూల మొక్కలునాటి పచ్చదనాన్ని పెంచి సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కృష్ణానగర్, బసంత కాలనీ పార్క్‌లను థీమ్ పార్కులుగా అభివృద్ధి తీర్చిదిద్దుతామన్నారు. పార్కుల్లో టైల్స్, పెయింటింగ్, పార్కుల చుట్టూ ప్రహరీ నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ అనిల్ కుమార్, ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈలు ప్రేరణ, ఫరీద్, హార్టికల్చర్ డైరెక్టర్ రాజశేఖర్, మేనేజర్ సత్య, వర్క్ఇన్స్పెక్టర్ శ్రీధర్, ప్రాజెక్ట్ అధికారి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.