Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
వరదముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులను ఆదేశించారు. నాలాల అభివృద్ధి, ముంపు ప్రాంతాల్లో చర్యలు, హై రిస్క్ టెకర్స్కు ప్రభుత్వం కొనసాగిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ, వెన్నెలగడ్డ చెరువు ఆధునీకరణ, గంపల బస్తీ నాలా, కోల్ నాలా అభివృద్ధి చర్యలపై శుక్రవారం కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల అధికారులతో సర్కిల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హై రిస్క్ టెకర్స్ కోసం ప్రభుత్వం కొనసాగిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వెన్నెలగడ్డ చెరువులో పరిసర ప్రాంతాల మురుగునీరు చేరుతుందని, సరైన ప్రణాళికతో చెరువును ఆధునీకరించాలని సూచించారు. వరద నీరు ఎక్కడ నిల్వ ఉండకుండా గంపలబస్తీ, కోల్ నాలా అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు లేకుండా నాలా అక్రమణలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైన అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీలు మంగతాయారు, రవీందర్‌కుమార్, ఈఈ కృష్ణ చైతన్య, ఏసీపీ సంతోష్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.