Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధన్వంతరీ అనుభవ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కరోనా విపత్కర సమయంలో ప్రాణాలు సైతం తెగించి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులపై, ఆస్పత్రులపై భౌతికంగా దాడులు జరగడం హేయమైన చర్య అని పలువురు వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు శుక్రవారం సాయంత్రం జగద్గిరిగుట్ట చివరి బస్టాప్‌లో ధన్వంతరీ అనుభవ వైద్యుల సంఘం జగద్గిరిగుట్ట ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు డాక్టర్ వంగరి విష్ణు మాట్లాడుతూ ఎంతో శ్రమకోర్చి వైద్యులు సేవలందిస్తున్నం కూడా దురదృష్టవశాత్తు రోగి మృతి చెందితే వారి బంధువులు, మిత్రులు వైద్యులపై ప్రత్యక్షంగా దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యవృత్తి ఎంతో పవిత్రమైందని, ఇలాంటి దాడులకు పాల్పడడం అమానుషమని పలువురు వైద్యులు ప్ల కార్డ్సులో నినాదాలు చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు డాక్టర్లు నరేందర్‌రెడ్డి, రవీందర్‌గౌడ్, ఉప్పల రవీకుమార్, నిరంజన్, హరికృష్ణ, ఆంజనేయులుచారి, సీహెచ్.శ్రీనివాస్, బాలకిషన్కుమార్, ధన్రాజు, కె.లక్ష్మి, రాంప్రసాద్, కె.లక్ష్మీనర్సయ్య, నారా మల్లేష్, టి.ఆర్.గౌడ్, మేడారం రాజు తదితరులు పాల్గొన్నారు.