Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సాయి చిత్ర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు లక్ష్మీ నగర్, రవీంద్ర నగర్ కాలనీ వాసులు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కాలనీల సమస్యలపై శుక్రవారం వినతి పత్రం అందజేశారు. సాయి చిత్ర నగర్ డ్రయినేజ్ అవుట్ లెట్, రామంతపూర్ చెరుకు అవుట్ లెట్ ను ఎత్తు తగ్గించి పైపులైన్ ఏర్పాటు, అనుబంధ కాలనీలో ముంపునకు గురికాకుండా 125 హెచ్ పీ మోటార్ ఏర్పాటుచేసి నీటిని బయటకు పంపించే చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం దిశగా కషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీల వాసులు కంచర్ల సోమిరెడ్డి, వెల్లంకి రవీందర్ రెడ్డి, పసుమర్తి నాగేష్, గడ్డం ఉపేందర్, అనిల్, పాశం నగేష్, మహేందర్, మల్లయ్య, పరమేశ్వర్చారి, సీతారాం, వసుంధర రెడ్డి, విద్యాధర్ రెడ్డి, వెంకట్, జాలయ్య, సుఖ జీవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.