Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
మల్లారెడ్డి గార్డెన్‌ను వెంటనే స్వాధీనం చేసుకోవాలని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈమేరకు మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఆకులతో కలిసి బోర్డు అధ్యక్షుడు కమాండర్ అజిత్ చంద్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. రక్షణ శాఖకు సంబంధించిన ఓల్డ్ గ్రాండ్ బంగ్లాలో మంత్రి మల్లారెడ్డి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. ఇందుకు ఉదాహరణ ఫంక్షన్ హాల్లో స్వయానా మంత్రి సోదరుడు నరసింహారెడ్డి పేకాట ఆడుతూ ఉంటే టాస్క్ఫోÛర్స్ పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారని రక్షణశాఖ అధికారులకు వివరించారు. అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిన మల్లారెడ్డిని తక్షణమే స్వాథీనం చేసుకోవాలని బీజేపీ నాయకులు వినతిపత్రంలో పేర్కొన్నారు.